
-
అధిష్టానం వ్యూహాత్మక ఎంపిక
-
భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని యువ నాయకుడికి పగ్గాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : తెలుగు రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. పరిటాల రవి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల శ్రీరామ్ సరైన రాజకీయ అవకాశం కోసం వెతుకుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మవరం టికెట్ ఆశించారు. కానీ సమీకరణల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆస్థానం కేటాయించాల్సి వచ్చింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత గెలిచారు. ప్రస్తుతం ధర్మవరం టిడిపి బాధ్యతలు చూస్తున్నారు శ్రీరామ్. అయితే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ పీఠాన్ని పరిటాల శ్రీరామ్కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో బీసీ మహిళకు…
గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనంతపురం జడ్పీ చైర్మన్ పీఠం బీసీ మహిళకు కేటాయించారు. అయితే ఈసారి జనరల్ కు మారడంతో జడ్పీ పీఠంపై కన్నేశారు పరిటాల శ్రీరామ్. టిడిపి హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన స్థానిక పరిస్థితులతో జిల్లా పరిషత్ పగ్గాలపై తెలుగుదేశం పార్టీ పట్టు బిగించేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా శ్రీరామ్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు క్యాడర్లో జోష్ నింపేందుకు ఒక బలమైన ప్రజానాయకుడిని జడ్పీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచనలో టిడిపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తు ఆలోచనతోనే…
రాప్తాడు నియోజకవర్గంలో తల్లి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బిజెపికి చెందిన సత్య కుమార్ యాదవ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ కు జడ్పీపీఠం అప్పగించడం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఓ ప్రయత్నం గా తెలుస్తోంది. యువనాయకత్వానికి ప్రోత్సహించినట్టు ఉంటుంది. భవిష్యత్తులో ఉమ్మడి అనంతపురం జిల్లాను శ్రీరామ్ ద్వారా అదుపులో ఉంచుకునేందుకు లోకేష్ ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే జిల్లా మొత్తం పట్టు నిలుపుకునే అవకాశం. తద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకునే ఎత్తుగడగా భావిస్తున్నారు విశ్లేషకులు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడ చదవండి:
- పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు.. అప్పూ మరణంపై డాక్టర్ కీలక వ్యాఖ్యలు!
-
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. పాఠశాల పైకప్పు కూలి 22 మంది మృతి!
-
కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నిధులా? మేరీ మిల్బెన్కు అభిజీత్ దీప్కే స్ట్రాంగ్ కౌంటర్!
-
భారతీయ ఇతిహాస చిత్రాల్లో రామయణం ఒకటి…! కాని హలీవుడ్ స్తాయిలో విజువల్స్ లేవంటూ విమర్శలు…