తెలంగాణ

సీఎం సహాయ నిధి పేదలకు వరం : శ్రీనివాస సేవా సమితి చైర్మన్‌

గండిపేట్‌, క్రైమ్ మిర్రర్:- సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని శ్రీనివాస సేవా సమితి చైర్మన్‌ పెండ్యాల సాయిమాలిక్‌ అన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ చోరవతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు శనివారం ఆయన పంపిణి చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు. నిరుపేదలు ధరఖాస్తులు పెట్టుకున్న వెంటనే నిధులు మంజూరైయ్యేలా చోరవ తీసుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read also : పిచ్చి పిచ్చి వీడియోలు చేసి వాగుకు.. హోమ్ మినిస్టర్ పై మండిపడ్డ రోజా

Read also: అనుమానస్పద స్థితి లో 2వ తరగతి విద్యార్ధి మృతి

Read also : అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారీ పట్టివేత..!

Back to top button