
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని చిన్న కోడెపాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2002-2003 సంవత్సరంలో పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. కుటుంబ భాద్యతలను మోస్తూ ఎక్కడెక్కడో వివిధ రంగాలలో స్థిరపడిన వారంతా ఒకే చోటుకు చేరుకొని ఆప్యాయ్యంగా పలకరించుకున్నారు.ఒకరినొకరు అలింగనం చేసుకొని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆనాటి నాటి గుర్తులను విద్యార్థులు గురువులను గుర్తు చేసుకుంటూ విద్యార్థుల మధ్య గురువుల మధ్య ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మెమోంటో శాలువాలతో ఘనంగా సత్కరించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా…. టీచర్స్ తీరు పై డీఈవో ఆగ్రహం?
22 ఏళ్ల నాటి విద్యార్థులను చూసిన ఉపాధ్యాయులు తన్మయత్వంతో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాంబలింగాచారి, నరేందర్ రెడ్డి,యాదగిరి, జితేందర్, దేవేందర్ రెడ్డి, సురేష్,యాసీన్, సత్యనారాయణ, కొముర రెడ్డి, కుమారస్వామి,లక్ష్మి , ఆనాటి అటెండర్ భాస్కర్ తో పాటు పూర్వ విద్యార్థులు బొట్ల ప్రతాప్, వైనాలా నరేష్, కోలేపాక రాజు, ఆలేటి కుమారస్వామి, గంగరబోయిన రమేష్, దుప్పటి సురేష్, గొల్లపల్లె రవి,కృష్ణవేణి, సునీత కల్పనా, రమా, వర్ణలత, శారదా, పాల్గొన్నారు.
పవన్, లోకేష్ కంటే పోసాని ఎక్కువగా బూతులు తిట్టారా?: అంబటి రాంబాబు
నితిన్ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్!.. అసలు తగ్గేదేలే..