
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: దేశంలో గురూజీలు ఆధ్యాత్మిక పేరుతో మహిళలను వేదించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ గూరూజీ మహిళను వేధించిన ఘటన జుబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. జుబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మిక పేరుతో శ్రీ చైతన్య అలియాస్ గురూజీ అలియాస్ సునిల్ రెడ్డిసాఫ్ట్వేర్ ఇంజినీర్ విష్ణుదీప్రెడ్డి కాపురంలో సునీల్‌రెడ్డి సమస్యలు తీసుకువచ్చాడు. సాధనల పేరుతో తన భార్యకు గురూజీ అసభ్య సందేశాలు, వ్యక్తిగత చాటింగ్‌లు పంపిస్తున్నాడని మహిళ భర్త విష్ణుదీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెళ్లయిన కొన్ని నెలల నుంచి తన భార్య పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. తన భార్యకు అసభ్య మెసేజ్‌లతో పాటు అభ్యంతరకరంగా మెసేజ్‌లు పెట్టాడని అన్నాడు.మేరెడ్డి సునీల్‌రెడ్డిని నిలదీసినందుకు తనను చంపేస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలి భర్త విష్ణుదీప్రెడ్డి పోలీసులకు చెప్పాడు. చాటింగ్ ఆధారాలు, బెదిరింపుల వివరాలతో కోర్టును ఆమె భర్త ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో గురూజీపై బీఎన్ఎస్ 351(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు
ఇవి కూడ చదవండి:
- జూనియర్ న్యాయవాదికి కిడ్నీలో రాళ్లు…ఆసుపత్రిలో చేరితే ప్రాణమే పోయింది…! మెడికవర్‌లో ఏం జరుగుతుంది…?
-
మమత బెనర్జీని హత్యచేసేందుకు కుట్ర…! కత్తితో వచ్చిన యువతి…పోలీసులకు అప్పగింత…
-
125 ఏళ్ల నిరీక్షణకు తెర…! తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే…
-
తామర పూల కోసం వెళ్లి.. చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి