
జగిత్యాల జిల్లా, క్రైమ్ మిర్రర్:- గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో గందరగోళం మధ్య, అత్యంత నత్త నడకన కొనసాగుతోంది. మొత్తం ఐదు వేర్వేరు గ్రామాల నామినేషన్లను ఒకే కేంద్రాన్ని (తిరుమలాపూర్)లో స్వీకరించాలని అధికారులు నిర్ణయించడం, దానికి తోడు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..తిరుమలాపూర్ పంచాయతీ కార్యాలయాన్ని ఐదు గ్రామాల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కేంద్రంగా ఏర్పాటు చేశారు.
Read also : పుట్టినరోజు నాడున 400 మంది పేదల కడుపు నింపిన విద్యార్థి మోక్షిత్
దీని కారణంగా ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఒకేసారి కేంద్రానికి చేరుకోవడంతో భారీ రద్దీ ఏర్పడింది. నామినేషన్ల పత్రాలను పరిశీలించడానికి, స్వీకరించడానికి గంటల తరబడి అభ్యర్థులు క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.నామినేషన్ల ప్రక్రియకు కేవలం మూడు రోజుల సమయాన్ని మాత్రమే కేటాయించడంపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఇంత తక్కువ సమయంలో, ఐదు గ్రామాల ప్రక్రియను సక్రమంగా, వేగంగా పూర్తి చేయడం అసాధ్యమని వారు వాపోతున్నారు. నామినేషన్ల పరిశీలనలో ఏ చిన్న లోపం జరిగినా, సమయం లేకపోవడం వల్ల దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఆర్.ఓ. సారు నిర్వాకంపై ఆగ్రహం. పక్రియకు ఇంచార్జిగా ఉన్న ఆర్.ఓ. సారు నిర్వాకం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఆయన నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. నామినేషన్ల పత్రాలను సరిచూసే ప్రక్రియను మందకొడిగా నిర్వహించడం వంటి కారణాలతో అభ్యర్థులు విసుగు చెందుతున్నారు. పట్టింపు లేని జిల్లా అధికారులు స్థాయిలో జరుగుతున్న ఈ తీవ్ర ఆలస్యంపై జిల్లా అధికారులు సైతం పట్టింపు లేని ధోరణిని ప్రదర్శిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నామినేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని, లేదా ఐదు గ్రామాలకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేసి తమ ఆందోళనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియను నిర్వహించే అధికారులు అవగాహన లోపంతో వ్యవహరిస్తున్నారని, వారి నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా, ఐదు గ్రామాలకు ఒకే కేంద్రాన్ని కేటాయించడం, నామినేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణమని వారు విమర్శిస్తున్నారు.
Read also : మహా పాపం జగన్.. అది చిన్న చోరీ ఏంటి?





