ఆంధ్ర ప్రదేశ్

ఎప్రిల్ కోటా టీటీడీ టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి టికెట్ల కేటాయింపు జరుగనుంది. అలాగే కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

300 టికెట్లు ఈనెల 24వ తేదీన విడుదల కానున్నాయి. వృద్ధులు, వికలాంగులకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటాను జ‌న‌వ‌రి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ విడుదల చేయనుంది. జ‌న‌వ‌రి 24న ఉదయం 10 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు వెబ్‌సైట్ ద్వారా ఆర్జిత‌సేవ‌లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

Back to top button