
మాడ్గుల,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలంలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక హైకోర్టు తీర్పుతో సంబంధిత అధికారులు వాయిదా వేసినట్టు విశ్వాసనియా సమాచారం. వివరాలలోకి వెళితే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా నర్సంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ సోనా హనుమాన్ రాథోడ్ పేరు ఆన్లైన్ ఓటర్ జాబితాలో ఉండి ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఓటర్ జాబితాలో పేరు లేనందువలన కుభ్య తండాలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్ లో సంబంధిత అధికారులు నామినేషన్ పత్రాలు తీసుకోకుండా నిరాకరించడంతో పలుమార్లు మండల ఎన్నికల అధికారిని బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా ఆమె నామినేషన్ పత్రాలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు హైకోర్టు సూచించినప్పటికీ నామినేషన్ పత్రాలు తిరస్కరించడంతో అధికారుల తీరుపై బాధితురాలు మరల హైకోర్టును ఆశ్రయించగా ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టు సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. సంబంధిత మండల ఎన్నికల అధికారి నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మండల ప్రజలు వేచి చూడాల్సిందే.
Read also : Chinese Media: పుతిన్ భారత్ పర్యటనపై చైనీస్ మీడియా ప్రశంసలు, కారణం ఏంటంటే?
Read also : మన రాజధాని అద్భుతంగా ఉండాలి.. నాణ్యతలో రాజీ పడకండి : సీఎం





