
Looteri Dulhan Arrested: బాగా చదవుకుంది. టీచర్ ఉద్యోగం చేస్తుంది. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్చించాల్సిన ఆమెలో.. డబ్బుల కోసం తప్పుడు బుద్ధి పుట్టింది. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. వారి నుంచి లక్షల రూపాయలు దోచుకుంది. 9వ పెళ్లి చేసుకుంటుండగా, పోలీసులకు చిక్కింది. ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తింటుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సమీరా ఫాతిమా చక్కగా చదువుకుంది. ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. డబ్బు కోసం తప్పుడు మార్గం ఎంచుకుంది. ఓ ముఠాతో కలిసి డబ్బున్న ముస్లీంలను పెళ్లి చేసుకుని మోసం చేయటం మొదలెట్టింది. 15 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మాట్రిమోనియల్ వెబ్ సైట్లు, ఫేస్ బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్‌బుక్, వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులు అయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది. వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి.. పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బులు పంపేలా చేసుకునేది. 8 మందిని మోసం చేసిన ఆమె.. 9వ వ్యక్తిని కూడా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడం అసలు కథ బయటపడింది. సమీరాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా నిత్య పెళ్లి కూతురు జైల్లో ప్రస్తుతం చిప్పకూడు తింటుంది.
Read Also: జీతం రూ. 15 వేలు.. ఆస్తి రూ. 30 కోట్లు!