
నాగార్జునసాగర్, క్రైమ్ మిర్రర్ :- కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఈ రోజు దాని పూర్తి స్థాయి 590 అడుగులు చేరుకుంది. రిజర్వాయర్‌లో 312 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా, అదనంగా వస్తున్న వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు 8 క్రెస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కి ఇన్‌ఫ్లో 65,842 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,09,952 క్యూసెక్కులుగా నమోదైంది. అదనపు వరద ప్రవాహం కొనసాగుతుందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Read also : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
ఈ దృశ్యం చూడటానికి ప్రాజెక్ట్ వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుతున్నారు. వరద నీటితో నిండిన కృష్ణా నది, గేట్ల నుండి ఉప్పొంగి వస్తున్న జలపాతం వంటి ప్రవాహం ప్రాంత ప్రజలకు ఉత్సాహం నింపుతోంది.డ్యామ్ చూస్తూ పర్యాటకులు తెగ కనువిందు చేస్తున్నారు. దాదాపు 17 ఏళ్ల తరువాత జులై లోనే గేట్లు ఎత్తడం ఇదే మొదటి సారి.
Read also : ఆమనగల్లు యువకుని మృతదేహం లభ్యం