
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజులపాటు మన భారతదేశంలో పర్యటించనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే మోదీ మరియు పుతిన్ మధ్య మంచి సంబంధం ఉన్న విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. అయితే ఇదే సందర్భంలో పుతిన్ మరియు మోదీ మధ్య జరిగినటువంటి సరదా సంభాషణతో ట్రంప్ కు ఎక్కడో మండుతున్నట్లు ఉంది అని ఇండియన్ నెటిజనులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ఫోటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా చేరేలా షేర్లు చేస్తున్నారు. అయితే ఇండియన్ నేటిజనులు ఇలా చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ కు టారిఫ్స్ విషయంలో ట్రంప్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఈ భేటీతో ట్రంప్ ఫోటోలను ఫన్నీ మీమ్స్ గా తయారుచేసి.. టారిఫ్స్ ఇంకా పెంచుతాడేమోనని సెటైర్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే రష్యాతో మంచి సంబంధాలు పెంచుకున్నామన్న భావనతోనే కోపంతో రగిలిపోయిన ట్రంప్ మనపై అధిక టారిఫ్స్ విధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.
Read also : అఖండ-2 మూవీ టికెట్ ను 5 లక్షలకు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే..!
Read also : మహా పాపం జగన్.. అది చిన్న చోరీ ఏంటి?





