జాతీయం

ఏప్రిల్ 1 నుంచి మొబైల్ ఫోన్లు,LED, LCD టీవీల ధరలు తగ్గింపు!

హైటెక్నాలజీ మొబైల్ వాడాలనుకుంటున్నారా.. మంచి ఫీచర్స్ ఉన్న టీవీ కావాలని ఆశగా ఉందా.. బడ్జెట్ అడ్జెస్ట్ కాక నిరాశలో ఉన్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. రెండు వారాలు ఆగితే మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుక్కోవచ్చు. ఏప్రిల్ 1 అంటే కొత్త ఫైనాన్సియర్ ఇయర్ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల రేట్లు భారీగా తగ్గనున్నాయి.

గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌లో వివిధ దిగుమతి వస్తువులపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం మొబైల్ ఫోన్లు,LED, LCD టెలివిజన్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

కేంద్ర బడ్జెట్‌లో సెల్ ఫోన్ బ్యాటరీలు మరియు టెలివిజన్లలో ఉపయోగించే ఓపెన్ సెల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి. ప్రాణాలను రక్షించే మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీనివల్ల ఆ మందుల ధర తగ్గే అవకాశం ఉంది. వైద్య పరికరాలు, క్యాన్సర్ మందులు సహా అనేక ఔషధ ఉత్పత్తులపై పన్నులు తగ్గించబడ్డాయి. దీంతో బంగారం, వెండి, దుస్తుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button