
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఒక అద్భుతాన్ని తయారు చేశాడు. దాదాపుగా ఐదు సంవత్సరాలు కష్టపడి ఒక మనిషి నడపగలిగే డ్రోన్ టాక్స్ ని తయారు చేసి రికార్డు సృష్టించాడు. ఇక ఇది తయారు చేయడానికి ఏకంగా 3.5 లక్షలు ఖర్చు చేశారని చెప్పుకొచ్చాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కు చెందిన మేధాన్స్ త్రివేది అనే ఇంటర్ విద్యార్థి దాదాపుగా ఐదు సంవత్సరాలు పాటు కష్టపడి ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ టాక్సీని తయారు చేయడం మన భారతదేశానికే గర్వకారణం. తన అద్భుతమైన ప్రతిభతో ఒక అద్భుతాన్ని సృష్టించడంతోపాటు దాన్ని తానే సొంతగా ట్రయల్స్ కూడా చేశాడు. ఇక ఈ పరికరానికి MLDT 01 అనే పేరును కూడా తానే పెట్టాడు.
Read More : ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు!..
ఇది దాదాపుగా 60 కిలోమీటర్ల వేగంతో పాటు 80 కేజీల బరువున్న వ్యక్తిని కూడా ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలదని చెప్పుకొచ్చారు. దీన్ని తయారు చేయడానికి దాదాపుగా మూడు నెలలపాటు కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ డ్రోన్ టాక్సీని తయారు చేయడానికి ఏకంగా 3,50,000 వరకు ఖర్చు చేశానని చెప్పాడు. దీంతో ఒక ఇంటర్ విద్యార్థి ఇంత చేయగలిగితే మరి ఎక్కువ చదువుకున్న వ్యక్తులు ఇంక ఎంత చేయగలరనే సందేశాన్ని ప్రతి ఒక్కరిలోను నింపాడు మేధాన్సు త్రివేది.
Read More : సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!..
ప్రస్తుతం మధ్యప్రదేశ్ చెందిన ఈ ఇంటర్ విద్యార్థి తన ప్రతిభతో చేసిన ఈ టాక్సీని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఏకంగా ఈ విద్యార్థి చేసిన ట్రయల్స్ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రమంతటా కూడా వ్యాపించింది. దీంతో ఇంటర్లోనే ఇంత ప్రతిభ కనబరిచిన మేధాంస్ త్రివేది భవిష్యత్తులో ఇంకెన్ని పరికరాలను తన ప్రతిభతో తయారు చేస్తాడనేది అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా అంతట కూడా ఈ ఇంటర్ విద్యార్థి త్రివేదిపై మంచి కామెంట్స్ వస్తున్నాయి.
Read More : పట్టణాల నుండి గ్రామాలకు పాకిన సైబర్ స్కామ్స్!… జాగ్రత్త?