
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో కాకా రేపుతున్నాయి. అందినకాడికి దోచుకుంటున్నారంటూ ఏది వదలడం లేదని ఇలా రాష్ర్ట ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్న శాఖలోనే రేడియల్ రోడ్లది అతి పెద్ద కుంభకోణం. కాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్.లు అన్ని సీఎం పరిధిలోకి వస్తాయి. ఒక్క సీఎం శాఖ పరిధిలోనే జీహెచ్ఎంసీలనే రూ.వేల కోట్లు దోపిడి చేస్తే ఎలా….? దీంతో సీఎం తీరుతో రాష్ర్ట ప్రజలు తీవ్రంగా పోతారని తన యూట్యూబ్చానల్తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం మొదలు అన్ని స్థాయిల నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలకు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆయ న ఇన్నాళ్లూ ప్రభుత్వం తీరును తప్పుబట్టినా.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.
ఎక్కువ రేటుకు టెండర్లు అందినకాడికి దోచుకోవడం…
టెండర్లలో భారీగా గోల్మాల్ జరుగుతున్నదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు మిగిలించేలా తక్కువ రేట్‌కు టెండర్లు వేస్తే నచ్చదు. ఎక్కువ రేట్‌కు వేసే వాడే కావాలి. వాళ్ల ద్వారా పైసలు సంపాదించుకోవాలి, తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేయాలి. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం కూడా. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైన నా కంపెనీనే తక్కువ రేటుకు వేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఎక్కువ రేట్‌కు టెండర్లు వేసిన ఆంధ్రా కాంట్రాక్టర్ల కంపెనీలకు కట్టబెడుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అప్పుగా తెచ్చిన సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కంటే దుర్మార్గం ఇంకేముంటుంది? మూడేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తున్నది’ అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు ఉండవని, ప్రభుత్వం అప్పు తెచ్చిన డబ్బులను రేడియల్ రోడ్ల పేరుతో ఎక్కువ రేట్లకు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ‘ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను. అయినా సరే ఇట్లా దుర్మార్గం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు మిగిలించేలా తక్కువ రేటుకు టెండర్లు వేస్తే నచ్చదు. ఎక్కువ రేటుకు వేసే వాడే కావాలి. వాళ్ల ద్వారా పైసలు సంపాదించుకోవాలి. తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేయాలి. ఇది దుర్మార్గమైన ఆలోచన. కాంగ్రెస్ ఎమ్మెల్యేనైన నా కంపెనీనే తక్కువ రేటుకు టెండర్ వేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఎక్కువ రేటుకు టెండర్లు వేసిన ఆంధ్రా కాంట్రాక్టర్ల కంపెనీలకు కట్టబెడుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అప్పుగా తెచ్చిన సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కంటే దుర్మార్గం ఇంకేముంటుంది? మూడేండ్లుగా రేవంత్ ప్రభుత్వం ఇట్లనే చేస్తున్నదని ఆరోపించారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఇవి కూడ చదవండి:
- రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సూపర్ స్టార్ ఆత్మకథ..
-
ముంబై నిరసనలో అమీర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదుకు బీజేపీ నేత సిద్ధం!
-
రజనీకాంత్‌పై అభిమానం.. 230కి పైగా పాత్రలతో బొమ్మల కొలువు! మధురైలో ప్రత్యేక ఆకర్షణగా సూపర్‌స్టార్ ఆలయం
-
‘ఏఏ23’పై లోకేశ్ కనగరాజ్ కీలక అప్డేట్.. అల్లు అర్జున్ అభిమానుల్లో మళ్లీ పెరిగిన అంచనాలు!