Homeక్రైమ్HIV రక్తం ఎక్కించిన సైకో.. అవమానంతో యువతి ఆత్మహత్య!

HIV రక్తం ఎక్కించిన సైకో.. అవమానంతో యువతి ఆత్మహత్య!

మేడ్చల్‌ జిల్లా పోచారం పరిధిలో విషాదకర ఘటన జరిగింది. యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం కిరాతకానికి పాల్పడ్డాయి. సదరు యువతికి హెచ్ఐవి రక్తం ఎకకించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

జనగామ ప్రాంతానికి చెందిన ఓ 25 ఏళ్ల యువకుడు చిన్ననాటి నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. రీసెంట్ గా అతడి మరదలుతో పెళ్లి కుదిరింది. అయితే, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉంది. ఇప్పటికే అతడి తండ్రి చనిపోయాడు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు యువతి తండ్రి హెచ్ఐవి పరీక్ష చేయించాడు. ఇందులో పాజిటివ్ వచ్చింది. దీంతో యువతి కుటుంబం ఈ పెళ్లిని రద్దు చేసింది.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేక యువకుడు కక్ష పెంచుకున్నాడు. గత నెలలో ఒకరోజు యువతిపై బలవంతంగా హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబానికి చెప్పడంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో యువతి తీవ్రంగా మనస్తాపానికి గురైంది. తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ తట్టుకోలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు వీడియో సందేశం ఇచ్చి, తనకు జీవించడం ఇష్టం లేదని తెలిపింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వేదన వ్యక్తం చేసింది. తాజాగా ఆమె తన నానమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు