
క్రైమ్ మిర్రర్, భువనగిరి జిల్లా:- ఒక పెద్ద బండను బ్లాస్టింగ్ చేసి కడిలను తీసే క్రమంలో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని కాశివారి గూడెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బండను పగలగొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బండ మీద పడి ఎస్ కే. సలీం(30) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాశివారి గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి సలీం కుటుంబ సభ్యులు,బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.
నారాయణమూర్తి అలా, ఇన్ఫోసిస్ ఇలా.. ఉద్యోగులకు కీలక సూచనలు!
వరంగల్ కాంగ్రెస్‌లో రగులుతున్న కొండా చిచ్చు – మళ్లీ మాటల తూటాలు పేల్చాడుగా..!