
ఢిల్లీ, క్రైమ్మిర్రర్: ప్రేమకు బాష, ప్రాంతం, దేశం అడ్డుకాదని ప్రేమ ఎంత గొప్పదో నిరూపించే ఘటన బిహార్లో చోటు చేసుకుంది. తను ప్రేమించిన ప్రియుడి కోసం రష్యా నుంచి ఖండాలు దాటి ఇండియాకు వచ్చి ఘటన ఇప్పుడు సోషల్మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన రాహుల్ యాదవ్కు అక్కడ పరిచయమైన జూలీ అనే యువతి అతడితో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత రాహుల్ భారత్కు తిరిగొచ్చారు. కాని వీరి ప్రేమ బందః అలాగే కొనసాగింది. దూరం పెరిగిన ప్రేమ తగ్గకపోవడంతో చివరికి కలిసి జీవించాలని ఈజంట నిర్ణయించుకొంది.
ఈ క్రమంలో జూలీ తన తల్లిదండ్రులతో కలిసి భాగల్పూర్లోని రాహుల్ ఇంటికి చేరుకుంది. విదేశానికి చెందిన యువతి తమ ప్రాంతానికి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా..ఈ ప్రేమకథ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాహుల్, జూలీ వివాహంపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వీరి వివాహం నవంబర్లో జరగనుంది. పెళ్లి తర్వాత ఎక్కడ నివసించాలనే అంశంపైనా ఈ జంట మాట్లాడుకున్నట్లు సమాచారం. తమ కుటుంబం చిన్న గుడిసెలో నివసిస్తోందని రాహుల్ జూలీకి వివరించినప్పటికీ, అతడితో కలిసి అక్కడే జీవించేందుకు ఆమె అంగీకరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక స్థితిగతుల కంటే తమ బంధానికే ప్రాధాన్యం ఇచ్చిన ఈ జంట నిర్ణయం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇవి కూడ చదవండి:
- ‘రణబాలి’కి U/A సర్టిఫికెట్.. అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక సినిమా విడుదల!
-
సీజేపీకి అమెరికా నుంచి నిధులంటూ ఆరోపణలు.. సింగర్ మేరీ మిల్బెన్పై అభిజీత్ దీప్కే ఫైర్!
-
జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి.. హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు!
-
హైదరాబాద్లో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. సినిమా చూస్తూ డ్రైవింగ్! సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్