ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేత మిథున్‌రెడ్డికి లుక్‌ అవుట్‌ నోటీసులు

  • దేశం విడిచి వెళ్లొద్దని మిథున్‌రెడ్డికి ఆదేశాలు

  • మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

క్రైమ్‌మిర్రర్‌, అమరావతి: వైసీపీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు మిథున్‌రెడ్డి బిగ్‌షాక్‌ తగిలింది. మిథున్‌రెడ్డిపై ఏపీ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలిచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. లిక్కర్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మిథున్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మిథున్‌రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారు. ఒకవేళ అబ్రాడ్‌ వెళ్లాలని మిథున్‌రెడ్డి అనుకుంటే పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Back to top button