
ఢిల్లీ, క్రైమ్మిర్రర్:17వేల అడుగుల ఎత్తులో ఉండగానే ఇండితో విమానం పిడుగుపాటుకు గురైంది. దీంతో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. పాట్నా నుంచి లఖ్నవూ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం పిడుగు పాటుకు గురైంది. ఆ సమయంలో విమానంలో 104 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే పిడుగు పాటు కారణంగా విమానికి ముందు భాగం కాస్తా దెబ్బదిన్నంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు చేస్తున్నారు. క్లియరెన్స్ లభించిన అనంతరం వినియోగిస్తారు.
గత నెలలో స్వల్పంగా దెబ్బతిన్న విమానం…
గత నెలలో కూడ గువాహటీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో తోక భాగం రన్వేకు తగిలి స్వల్పంగా దెబ్బతింది. వాతావరణం సరిగా లేకపోవడంతో ల్యాండింగ్ సమయంలో కొంత ఇబ్బందికరంగా మారిందని ఇండిగో తెలిపింది. వాతావరణం అనుకూలించక మొదటి సారి ల్యాండింగ్ ప్రయత్నాన్ని విరమించుకున్న విమానం మరోసారి ల్యాండయ్యే సమయంలో ఇలా జరిగింది. అయితే, ఈ ఘటనలో విమానం సేఫ్గా దిగింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. తనిఖీల కోసం విమానాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు.
ఇవి కూడ చదవండి:
-
తిరుమల శ్రీవారి సన్నిధిలో తమన్నా.. ‘ఈరోజు దర్శనం ఎంతో ప్రత్యేకం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
-
డ్రగ్స్ నుంచి యువతను రక్షించడమే లక్ష్యం- నారా లోకేశ్
-
శివరాజ్ కుమార్కు తృటిలో తప్పిన ప్రమాదం.. కళ్లముందే పేలిన బాణసంచా
-
జైలర్ 2 సెన్సార్ పూర్తి.. రజినీకాంత్ మూవీ రన్టైమ్ ఎంతంటే?