
మద్దూర్, నారాయణపేట (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని భీంపురం గ్రామ శివారులో ఆదివారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో చిరుత పులి కనిపించినట్లు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో గ్రామస్తులు పొలాల చుట్టూ బ్యాటరీలు పట్టుకొని వెతికారు కానీ ఎక్కడ కనిపించలేదు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా మేము అందుబాటులో లేము ఉదయం వచ్చి చూస్తామని గ్రామస్తులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం ద్వారా తెలిసింది. గత 15 రోజుల నుంచి మద్దూరు మండలంలో చిరుతపులులు సంచరిస్తున్న ఫారెస్ట్ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మద్దూరు మండల ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులను మద్దూరు పట్టణ కేంద్రంలో నైట్ టైం ఉండేటట్లు చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వేణుగోపాల స్వామి ఆలయం లో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల!..
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?