
-
7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్
-
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లైన్ క్లియర్
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు. రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. జాతీయ రహదారి 65 పై అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మేర అత్యాధునిక డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జరిపిన ఉన్నత స్థాయి భేటీలో ఈ ప్రాజెక్టు పై సమగ్ర చర్చలు నడిచాయి. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతితో హైదరాబాద్ తూర్పు ముఖ ద్వారమైన విజయవాడ హైవేపై దశాబ్దాలుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు తెరపడనుంది..
సరికొత్త డిజైన్తో...
ఇదో మల్టీ లెవెల్ ఇంటిగ్రేటెడ్ డిజైన్తో రూపొందించే ప్రాజెక్ట్. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం.. భూమి మీద సాధారణ సర్వీస్ రోడ్లు కొనసాగుతుండగా.. మొదటి అంతస్తు వాహన రాకపోకల కోసం మూడు లైన్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. దీనిపై ఉండే రెండో అంతస్తులు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ విస్తరణ మార్గం వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. రోడ్డు రవాణా, మెట్రో నెట్వర్క్ రెండింటిని ఒకే స్తంభాల వరుసపై అనుసంధానించడం వల్ల భూ సేకరణ హారం భారీగా తగ్గనుంది.. సిగ్నల్ రహితంగా వేగవంతమైన ప్రయాణం సాధ్యం కానుంది.
లక్షలాదిమందికి ఊరట…
ఈ డబుల్ డెక్కర్ కారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే లక్షలాదిమందికి ఊరట లభించనుంది. ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మధ్య ఉన్న చింతలకుంట, పనామా, సుష్మ, వనస్థలిపురం, ఆటోనగర్ వంటి ప్రధాన జంక్షన్ లలో గంటల తరబడి ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. 7.1 కిలోమీటర్ల ఈ మార్గాన్ని దాటేందుకు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఎలివేటెడ్ కాళీ డాట్ నిర్మాణం పూర్తయితే సిటీ నుంచి విజయవాడ, సూర్యాపేట వైపు వెళ్లే దూరప్రాంత వాహనాలు నేరుగా హయత్ నగర్ మీదుగా ఓ ఆర్ ఆర్ ను చేరుకోవచ్చు. దీనివల్ల ఎల్బీనగర్ చుట్టుపక్కల విస్తరించిన 60కి పైగా కాలనీలా స్థానిక ప్రజలకు ట్రాఫిక్ రద్దీ తగ్గి సురక్షిత ప్రయాణం దక్కనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో శరవేగంగా డిపిఆర్ సిద్ధం చేసి.. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
- 24 లక్షల ఎకరాల అటవీ భూమి ఏమైంది? కాంగ్రెస్ సర్కార్కు ఏలేటి సూటి ప్రశ్న
-
మందుబాబులకు బిగ్ షాక్…! తెలంగాణలో ధరలు పెంపు…
-
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాఖాన్కు షాక్…! దేశం విడిచివెళ్లాలంటూ ఆదేశాలు జారీ…
-
సంతలో ఎవరైన అమ్మకాలు, కొనుగోలు చేయవచ్చు…! సర్పంచ్ రమాదేవి