
-
ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు రజనీకాంత్ భార్య
-
కేంద్ర మంత్రులతో వరుసగా చర్చలు
-
జాతీయస్థాయిలో ఉనికి కోసం ఆరాటం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు రాజ్యసభ పదవి దక్కనుందా? ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా? సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా ఇప్పుడు ఢిల్లీలో అదే పనిపై ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు అంతుచిక్కని విధంగా తయారయ్యాయి. ఓటర్ల పల్స్ పట్టడం కష్టతరంగా మారుతుంది. ఎప్పటికప్పుడు పొలిటికల్ సీన్స్ మారుతూ వస్తున్నాయి. అనూష మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అక్కడి రాజకీయాల అంతా సినిమాస్టార్లు, వారి కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, లేకుంటే ఆయన భార్య లతా రజనీకాంత్ కు రాజ్యసభ పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ప్రారంభం అయింది.
-
తరచూ ఢిల్లీలో..
గత కొద్దిరోజులుగా లతా రజినీకాంత్ ఢిల్లీలో తరచూ కనిపిస్తున్నారు. రాజ్యసభ పదవి దక్కించుకోవడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తనకు అవకాశం లభించకపోతే రజనీకాంత్ ను రాజ్యసభకు నామినేట్ చేసేలా బిజెపి అధిష్టానాన్ని ఒప్పించడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా లతా రజనీకాంత్ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్లతో పాటు బిజెపి అగ్రనేతలను స్వయంగా కలిసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి తన ప్రతిపాదనను వివరించేందుకు ఆమె గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
-
పాలిటిక్స్ లోకి వచ్చినట్టే వచ్చి..
రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ కంటే రజనీకాంత్ ముందు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ ఆయన మళ్లీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. మరోవైపు రజనీకాంత్ కు సమకాలీకుడు కమల్ హాసన్ డీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లారు.
ఆయన సైతం సొంత పార్టీని స్థాపించి అనుకున్న ఆదరణ దక్కించుకోలేదు. అందుకే ఆయన డిఎంకేకు మద్దతు ప్రకటించి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే జాతీయస్థాయిలో ఉనికి చాటుకోవాలంటే రాజ్యసభ లాంటి పదవి ఉండాలని లతా రజినీకాంత్ భావిస్తున్నారు.
అందుకే ఆమె రాజ్యసభ పదవి కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. విజయ్ అధికారంలోకి వచ్చిన కొత్తలో లతా రజనీకాంత్ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ భార్యగా లతా రజినీకాంత్ సుపరిచితురాలు.
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ కంటే లతా రజినీకాంత్ కు రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తమిళనాడు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.