Monday, February 23, 2026
Homeతెలంగాణమన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్

మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్

క్రైమ్ మిర్రర్ : భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంపై ప్రతిపాదికను త్వరలోనే కేంద్రానికి పంపిస్తామని తెలియజేయగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వడంపై పూర్తి మద్దతు తెలిపారు.

Read Also : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!

భారతరత్న అవార్డు పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తిగా అర్హులని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అసలు ముందుగా మన్మోహన్ సింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది మన తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు అని అన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా పని చేశారని తెలియజేశారు.

Also Read : రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే! మళ్లీ ఆన్ లైన్ అప్లికేషన్స్ అట..

కాగా ఈ మధ్య ఆనారోగ్య కారణంగా మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు భారతరత్న వచ్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేయగా ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తిగా మద్దతు తెలపడం సర్వస్త్ర ప్రశంసలు వెదజల్లుతున్నాయి.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
  2. శభాష్ కోమటిరెడ్డి.. రేవంత్ ఫోన్ తో ఉప్పొంగిన వెంకట్ రెడ్డి
  3. అక్కినేనిని పొగిడి.. ఎన్టీఆర్ పేరెత్తని ప్రధాని మోడీ!
  4. మై డియర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments