
-
వైసీపీని వీడేందుకు మాజీ డిప్యూటీ స్పీకర్ నిర్ణయం
-
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా..
-
కుమార్తె భవిష్యత్తు కోసం స్ట్రాంగ్ డెసిషన్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్ననే విజయనగరం జడ్పీ చైర్మన్, బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటు చేసుకుంది.
నేను సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు మరో నేత జనసేనలోకి చేరుతారని ప్రచారం నడుస్తోంది. వైసిపి హయాంలో డిప్యూటీ స్పీకర్గా పదవి చేపట్టిన కోలగట్ల వీరభద్ర స్వామి వైసీపీకి గుడ్ బై చెబుతారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తన అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి అధికార కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.
-
కీలక మంతనాలు..
ప్రస్తుతం జనసేన అగ్రనాయకత్వంతో వీరభద్ర స్వామి మంతనాలు చేస్తున్నట్లు కూడా ఉత్తరాంధ్ర వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీగా నేతలు గుడ్ బై చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో కోలగట్ల వీరభద్ర స్వామి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఉమ్మడి విజయనగరంలోని పట్టున్న నేతగా కోలగట్ల వీరభద్ర స్వామి ఉన్నారు. అశోక్ గజపతిరాజు పై గెలిచి జైంట్ కిల్లర్ గా నిలిచారు. రెండుసార్లు విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన జనసేనలో చేరుతారని తెలుస్తోంది.
-
జిల్లా పై పెను ప్రభావం..
చిన్న శ్రీను రాజీనామాతో విజయనగరం జిల్లాలో వైసిపి కాకావికలం అవుతోంది. ఇప్పుడు కోలగట్ల పార్టీ మారితే మాత్రం జిల్లాలో పెను ప్రభావం చూపడం ఖాయం. కేవలం పార్టీ మారడమే కాకుండా.. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో కీలకమైన బాధ్యతలను చేపట్టేలా ఆయన జనసేన అధిష్టానంతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకారం జరుగుతోంది.
ఉత్తరాంధ్రలో కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన నాయకత్వం కూడా బలమైన సామాజిక వర్గాలను, అనుభవం ఉన్న నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. విజయనగరం రాజకీయాల్లో చక్రం తిప్పిన కోలగట్ల జనసేన గూటికి చేరితే.. అది ఉమ్మడి జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ కానుంది.