క్రీడలు

కోహ్లీ, రోహిత్ ఫామ్ లో ఉంటే ఆడించాలి.. టీమిండియా ప్రత్యేకంగా ఎవరికోసం ఆగదు : గంగూలీ

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమిండియాలో క్రికెటర్స్ కొదవలేదు అని మాజీ క్రికెటర్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు గవాస్కర్, సచిన్ టీమిండియా క్రికెట్ చరిత్రలో అద్భుతంగా రాణించారు. ఆ తరువాత ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్, కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియా కు అండగా నిలబడ్డారు. మళ్లీ ఇప్పుడు జైష్వాల్, పంత్, గిల్ వాళ్ల క్రికెట్ ప్రతిభ ద్వారా టీమిండియాను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ అలాగే ఐపీఎల్ లీగ్ ద్వారా ఎంతో మంది ఇండియన్ క్రికెటర్స్ టీమిండియా కు వజ్రాలు లా దొరుకుతున్నారు అని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన మనసులోని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వన్డేల్లో కొనసాగడంపై కూడా గంగూలీ స్పందించారు.

Read also : బెంగళూరులో మరో భారీ క్రికెట్ స్టేడియం ఏర్పాటు!.. ఏ ప్రాంతంలోనో తెలుసా?

టీమిండియాలో బాగా ఆడే ప్లేయర్స్ ను కొనసాగించాలి అని అన్నారు. కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఫామ్ లో ఉంటే కచ్చితంగా కంటిన్యూ చేయాలి అని.. అన్నారు. వన్డేల్లో వారి రికార్డు ఎంత అద్భుతంగా ఉన్నది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే వైట్ బాల్ క్రికెట్లో వీరిద్దరికీ తిరుగులేదు. ఒకవైపు మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు.. కానీ ఫామ్ లో ఉంటే మాత్రం ఆడించాలి అని అన్నారు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం రాబోయే ఓడీ లలో కచ్చితంగా ఆడించాలి అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి చివరిసారిగా ఫిబ్రవరిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఆడారు. మరి ఇప్పటి నుంచి జరగబోయే వన్డే మ్యాచ్లో ఆడుతారో లేదో తెలియదు.

Read also : మునుగోడు ఎమ్మెల్యే పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు : మండల పార్టీ అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button