
క్రైమ్ మీర్రర్, జాతీయ న్యూస్:-
కార్తీకమాసం ప్రారంభమైన సందర్భంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా భక్తితో వివిధ శివాలయాలకు వెళ్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే మరో రెండు రోజుల్లో అనగా నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. మనదేశంలోని ప్రతి ఒక్క ఆలయం కూడా కార్తీక పౌర్ణమి రోజు భక్తులతో కిటికీటలాడనుంది. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశి మరో అద్భుత ఘట్టానికి వేదిక కాబోతుంది. ఈసారి స్పెషల్ గా కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రోజు కాశీలో దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను చేస్తుంది. కాశి గంగానది ఘాట్ లతో పాటుగా నది తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను ఉపయోగించి దీపాలను వెలిగించనున్నట్లు అధికారులు తెలిపారు . అదే సమయంలో కాశీ గొప్పతనాన్ని చాటే విధముగా ఏకంగా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో మరియు 3D ప్రజెంటేషన్ వంటివి చేయనున్నాము అని అధికారులు వెల్లడించారు. ఇలానే దేశవ్యాప్తంగా పలు దేవాలయాలలో లక్షల కొద్ది దీపాలను వెలిగించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని దేవాలయాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలను తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు నిష్టతగా అయ్యప్ప మాలలు వేసినటువంటి అయ్యప్ప స్వాములు వారి భక్తితో ఈ కార్తీకమాసం అంతా కూడా అయ్యప్ప నామస్మరణతో మారు మోగనుంది.
Read also : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు 4 మృతి!
Read also : ఆదివారం ఇండియాదే… ఎమోషనల్ అయిన ప్లేయర్స్!





