
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ : పాక్ గూఢాచారి కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో బాంబ్ షెల్! శత్రుదేశమైన పాకిస్తాన్‌లో ఆమెకు రాజభోగాలు లభించినట్లు ఒక నూతన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో జ్యోతి పాక్ టూర్‌లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
వీడియో ప్రకారం, జ్యోతికి పాక్ ప్రభుత్వం తరఫున ఏకంగా ఏకే-47లతో ఫుల్ ఆర్మీ ఏడుగురు గన్‌మెన్లు కేటాయించారట. ఆమె ప్రయాణించిన చోట్ల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఓ ప్రఖ్యాత యూట్యూబర్ పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
జ్యోతికి పాక్ అంతటి భద్రత కల్పించడం, ఆ దేశంలో అధికారుల మాదిరిగా చూసుకోవడం గుట్టు చప్పుడు కాకుండా ఆమె మిషన్ ఎంత కీలకమైందో సూచిస్తోంది. ఈ వీడియోపై భారత గూఢచారి శాఖలు మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ నూతన వీడియో వెలుగులోకి రావడంతో జ్యోతి కేసు మరింత ఉత్కంఠ భరితంగా మారింది.