క్రైమ్

ఆ 8మంది కాలి బూడిదయ్యారు, అధికారుల ప్రకటన

  • దుర్గటనలో ఇప్పటికే 44మంది మృతి

  • తాజాగా మరో 8మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన

  • సిగాచి పరిశ్రమ ప్రమాద మృతుల సంఖ్య 52కి చేరిక

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన దుర్ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకని 8మంది కాలిబూడిదైనట్లేనని అధికారులు ప్రకటించారు. గల్లంతయిన రాహుల్‌, శివాజీ, వెంకటేశ్‌, విజయ్‌, అఖిలేష్‌, జస్టిన్‌, ఇర్ఫాన్‌, రవి మంటల్లో కాలిపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని ఆయా కుటుంబ సభ్యులకు సూచించారు. ఒకవేళ ఆచూకీ తెలిస్తే సమాచారమిస్తున్నామని తెలియజేశారు. కాగా, ఇప్పటికే ఈ దుర్ఘటనలో ఇదివరకు 44 మంది మృతి చెందారు. ఈ 8మందితో కలిపి మొత్తం 52కి చేరింది మృతుల సంఖ్య.

కుప్పకూలిన భారత వాయుసేన విమానం, ఒకరు మృతి

పాశమైలారం సిగాచి పరిశ్రమను నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ బృందం పరిశీలించింది. సంస్థ నిర్వహణ, లోపాలపై యాజమాన్యానికి ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. సరైన సమాధానం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేసింది ఎన్డీఎంఏ.

Back to top button