
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: స్థానిక ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ పెట్టింది కూటమి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ప్రక్రియ బాగానే కొలిక్కి వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి జిల్లా పరిషత్తులపై పడింది. జిల్లా పరిషత్ పంపకాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయితీల సర్దుబాటు కూడా సజావుగా ముందుకు తీసుకెళ్లేలా భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 28 జడ్పీ పీఠాలు ఉన్నాయి. ఇందులో జనసేనకు ఎన్ని ఇస్తారు? బిజెపికి ఎన్ని కేటాయిస్తారు అనే చర్చ కూటమి పార్టీలో బలంగా నడుస్తోంది. అయితే ఇప్పటికే దీనిపై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. నేటితో ఎంపీటీసీలతో పాటు జడ్పిటిసిల నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 జడ్పీలు…
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ప్రాతిపదికన జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. ఈ లెక్కన ఏపీలో 28 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే షెడ్యూల్ కులాలు ఎస్సీలకు ఐదు స్థానాలు, షెడ్యూల్ తెగలు ఎస్టీలకు మూడు స్థానాలు, బీసీలకు ఆరు స్థానాలు దక్కాయి. మిగిలిన 14 స్థానాలను అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉంచారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు కేటాయించారు. బిజెపికి రెండు కార్పొరేషన్లు దక్కాయి. అయితే జడ్పిటిసి లతో పాటు ఎంపీటీసీల్లో 30% తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అందులో భాగంగా జనసేన 5 నుంచి 6 జడ్పీ చైర్మన్ స్థానాలను డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని కీలక స్థానాలను దక్కించుకోవడానికి జనసేన పార్టీ ప్రతిపాదనలు చేసింది. అందులో మూడు స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు స్థానాల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
టిడిపి తో గట్టి పోటీ…
ప్రధానంగా ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం టిడిపి, జనసేన మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయితే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ జనసేనకు ఇవ్వడంతో ఈ స్థానం టిడిపికి లభిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ స్థానాన్ని దక్కించుకోవడానికి జనసేన గట్టి ప్రయత్నాలు ఉంది. కాకినాడ జిల్లా పరిషత్ పీఠంపై కూడా టిడిపి, జనసేన మధ్య పోటీ ఉంది. జనసేన తరఫున ముద్రగడ పద్మనాభం కుమార్తె పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జడ్పీ స్థానంలో టిడిపి నేతలు ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాయలసీమకు సంబంధించి తిరుపతి జడ్పీ పీఠాన్ని తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా.. అక్కడ టిడిపి సైతం పట్టు బిగించాలని చూస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జడ్పీల విషయంలో ఒక స్పష్టత రానుంది.
ఇవి కూడ చదవండి:
-
తేజ సజ్జా పెళ్లిపై క్లారిటీ.. డిసెంబర్లో ఉదయ్పుర్లో డెస్టినేషన్ వెడ్డింగ్!
-
హాలీవుడ్లో సినిమా చేయడమే నా కోరిక.. ‘వారణాసి’ తర్వాతే ఆలోచిస్తా: రాజమౌళి
-
కోలీవుడ్‌లో మరో విషాదం… ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత..
-
ఏపీ ఎన్నికల విధుల నుంచి ముగ్గురు ఐపీఎస్‌లను తొలగించాలి.. ఉన్నతాధికారులకు ఎంపీ గురుమూర్తి లేఖ!