
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచులు అయిన వ్యక్తులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. కానీ ఈ సర్పంచులలో కొంతమంది సర్పంచులకు ఆ సంతోషం లేకుండా పోయింది. ఎందుకంటే ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు గురించి ప్రజలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ని కొన్ని గ్రామాలలో కొత్త సర్పంచులకు “కోతుల రహిత గ్రామం” అనే సవాళ్లు ఎదురవుతున్నాయి. చాలామంది ఈ పంచాయతీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రోడ్లు లేదా డ్రైనేజీలు వంటివి మాత్రమే కాకుండా కోతులు రహిత గ్రామం అనే హామీకి కట్టుబడి కూడా చాలామంది ఓటర్లు ఓట్లు వేశారట. ఇప్పుడు గెలిచిన తొలి రోజు నుంచే ఓటర్లు కోతులను ఊర్ల నుంచి తరిమేయాలని.. ఈ కోతుల బెడద తట్టుకోలేకపోతున్నామని సర్పంచులు ఎదుట వాపోతున్నారట.
Read also : విద్యార్థి చదువు కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి మరి లోన్ ఇప్పించిన హరీష్ రావు?
దీంతో సర్పంచులం అయ్యామన్న సంతోషం కన్నా ఈ కోతుల బెడదే ఈ నూతన సర్పంచులకు కొత్త సవాలుగా మారిపోయింది. లేచిన దగ్గరనుంచి ఈ కోతులు పంట పొలాలు అలాగే ప్రజల ఇళ్లలోకి చొరబడి ప్రతి ఒక్కటి నాశనం చేస్తున్నాయి అని.. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలను కోతులు గాయాలు పరుస్తున్నాయి అని గ్రామస్తులు సర్పంచులను ప్రశ్నించడంతోపాటు వాటికి పరిష్కారం చూపాలని కోరుతున్నారట. దీంతో గ్రామంలో నుంచి కోతులను తరిమేయడమే ఈ కొత్త సర్పంచ్ లకు ఒక అగ్నిపరీక్షగా మారింది. కోతులను తరిమి కొట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేక అవి పెట్టె తిప్పలకు తలుగుతారో అనేది మాత్రం వేచి చూడాలి.
Read also : జట్టులో పేరు లేదని బాధపడే రోజులు పోయాయి : ఇషాన్ కిషన్





