
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. దేశాన్ని విడిచివెళ్లాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసును ఆయన న్యాయస్థానంలో సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ముంబైలో సర్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే, అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి దిగాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం లేదా సోమవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. కోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
also read: మదనపల్లిలో “లేడీ డాన్” కోనేటి సులోచన అరెస్ట్.. ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు!