తెలంగాణ

ప్రచారాలు నమ్మకండి… బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీనీ వీడడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సోషల్ మీడియాలో చాలానే ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ వీడడం పై స్పందించారు. నేను రాజకీయాలనుంచి తప్పుకునేంతవరకు బిఆర్ఎస్ పార్టీని అసలు వీడే ప్రసక్తే లేదు అని మల్లారెడ్డి క్లారిఫై ఇచ్చారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి, మెడికల్ మరియు ఇంజనీరింగ్ సీట్ల విషయంలో మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లుగా తెలిపారు. కాంగ్రెసులోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్ లో ఉన్నారని చెప్పకొచ్చారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి తమ కుటుంబం నుంచి నలుగురు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తే ఎంపీగా పోటీ చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

కాగా మనందరికీ మల్లారెడ్డి ఏ స్థాయి నుంచి ఈరోజు ఏ స్థాయికి ఎదిగారో తెలిసే ఉంటుంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఏళ్లుగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. సొంతగా ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి వాటికి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు అని పేర్లు కూడా పెట్టుకున్నారు. ఏ ఈవెంట్ కి వెళ్ళినా లేదా కార్యక్రమానికి వెళ్లిన… పూలమ్మిన… పాలమ్మిన… అంటూ ప్రతి ఒక్కరినీ ఇన్స్పిరేషన్ చేసేలా మాట్లాడుతారు. తద్వారా రాజకీయంలో ఓ వెలుగు వెలిగిన వ్యక్తిలో మల్లారెడ్డి ఒకరు. అయితే మల్లారెడ్డి రాజకీయాలు వదిలేవరకు టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటూ ఒక క్లారిటీ ఇచ్చారు.

బంధన్ బ్యాంకులో బడా మోసం – 6 లక్షల పొదుపు సంఘాల డబ్బుతో మేనేజర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button