
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తన అందానికి, తన కర్లీ హెయిర్ కు ఒక టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తను నటించిన సినిమాలు చాలానే సూపర్ హిట్ అయ్యాయి. చేసింది కొద్ది సినిమాలే అయినా… ఫ్యాన్స్ మాత్రం టన్నుల కొద్ది ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు. అప్పట్లో ఒక సినిమాలో చేయడం అసలు నచ్చలేదు అని… చాలాకాలం తర్వాత ఆ సినిమాకి ఓకే అని చెప్పి పూర్తి చేశానని అన్నారు. ఇంతకీ ఏంటి ఆ సినిమా అంటే… సిద్దు జొన్నలగడ్డతో నటించిన “టిల్లు స్క్వేర్“.
Read also: అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్ కు అలవాటే : భారత్
ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు అసలు కంఫర్ట్ గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన మనసులోని మాటను చెప్పారు. చాలా రోజులపాటు ఈ సినిమాలో నటించాలా వద్దా అనేది ఆలోచించాకే..ఫైనల్ గా చిత్ర బృందానికి ఓకే చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో లిల్లీ పాత్ర చేయడం అనేది అసలు నచ్చలేదని అన్నారు. 100% కాన్ఫిడెంట్ గా సినిమాలో నటించలేదని కూడా చెప్పుకొచ్చారు. ఇదంత ఒక ఎత్తు అయితే చివరిలో అనుపమ పరమేశ్వరన్ చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ గా నిలిచాయి. సినిమా ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే… దానిని ఆటిట్యూడ్ అంటారని అనుపమ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుపమ పరమేశ్వరన్ తాజాగా పరదా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.