
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి నుంచి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు రూ.2.25 కోట్ల విలువైన బంగారం బయటపడింది.
డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో సదరు ప్రయాణికుడి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 1,481.780 గ్రాముల బంగారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్‌లో ఉంచి, దానిపై బ్లూ కలర్ అడెసివ్ టేప్, కార్బన్ పేపర్‌తో చుట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అనంతరం బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. దానిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: శ్రీకాకుళంలో విషాదం.. ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి తల్లి ఆత్మహత్య