
క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలోని పూణెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదనపు కట్నం, ఆస్తుల కోసం భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు తట్టుకోలేక 33 ఏళ్ల మహిళా ఐటీ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిష్ణ రాహుల్ సక్పాల్ అనే మహిళకు, రాహుల్ సక్పాల్తో 2018లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచే త్రిష్ణ తీవ్ర మానసిక, శారీరక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఆమె తండ్రి బాలకృష్ణ నికమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిష్ణ సంపాదించే పూర్తి జీతం తమకివ్వాలని, పుట్టింటి వారు ఇచ్చిన ఫ్లాట్‌ను అత్త పేరుపై మార్చాలని ఆమెను నిత్యం వేధించారు. అంతేకాకుండా, కోటి రూపాయల విలువైన ఫ్లాట్‌ను మామ కోసం కొనుగోలు చేయాలంటూ భర్త కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని తండ్రి ఆరోపించారు.
ఈ వేధింపులు భరించలేక త్రిష్ణ 2021లో పుట్టింటికి చేరుకున్నారు. మరో వివాహం చేసుకునేందుకు ఆమె భర్త కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఈ వివాదం నడుస్తుండగానే త్రిష్ణ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు భర్త రాహుల్, అత్త వైశాలి, మామ సంజయ్, మరదలు శైలి కారణమని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది.
also read : మీ అకౌంట్లో డబ్బులు లేవా…! క్రెడిట్ లైన్ విధానంతో పేమెంట్స్…! అది ఎలాగంటే…