
విశాఖపట్నం, క్రైమ్‌మిర్రర్: హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తొలిప్లీట్ సపోర్ట్షిప్కు సూర్యగా మంగళవారం నామకరణం చేసిన శిలాఫలకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.హిందూస్థాన్ షిప్ యార్డ్.. మారిటైమ్ కాస్టోడియన్గా ఉంటుందన్నారు. పురాతన కాలం నుంచి నౌకాయాన, నౌకల ద్వారా వ్యాపారం కొనసాగిందని గుర్తుచేశారు. జల ఉష నౌక తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల నిర్మాణం వరకు హెచ్ఎస్ఎల్ పయనం గొప్పదని కొనియాడారు.
2025లో హెచ్‌ఎస్‌ఎల్‌కు ‘మినీ రత్న’ హోదా వచ్చిందన్నారు.సముద్ర సంబంధిత నియమ నిబంధనలను అనుసరిస్తూ దేశ రక్షణతో పాటు ప్రపంచ సముద్ర జలాలను పరిరక్షిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. 26 ఏళ్ల క్రితం రవాణా మంత్రిగా హెచ్ఎస్ఎల్ కోసం విశాఖకు వచ్చానని.. ఇప్పుడు రక్షణ మంత్రిగా హెచ్‌ఎస్‌ఎల్‌కు వచ్చానని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మరింత నమ్మకం వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ రంగానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు సహకారం బాగుందని కొనియాడారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్, నేవీ, షిప్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడ చదవండి:
-
రామాయణం షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
-
శంషాబాద్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. రూ.30 లక్షలకు పైగా నగదు అపహరణ
-
చదువులో వెనుకబడ్డారని 82 మంది విద్యార్థులకు సగం గుండు.. మహారాష్ట్రలో కలకలం
-
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి…