మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ లోనే పోలీసు అధికారులకు క్లాస్ పీకారు. సెక్షన్లు, చట్టాలంటూ ఏసీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు రఘునందన్ రావు. ఏసీపీపై రఘునందన్ రావు ప్రశ్నల వర్షం కురిపించగా.. పోలీస్ స్టేషన్ లో ఉన్న సీఐలు, ఎస్ఐలు అలా చూస్తూ ఉండిపోయారు. దాదాపు గంటసేపు పోలీస్ స్టేషన్ లో హంగామా చేశారు వకీల్ సాబ్, ఎంపీ రఘునందన్ రావు. ఏసీపీతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.
సిద్ధిపేట – కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో చర్చి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిలో అక్రమ చర్చి నిర్మిస్తున్నారంటూ కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. నిర్మాణ పనులను అడ్డుకుని కట్టిన గోడను కూల్చివేశారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన 8 మంది యువకులపై చర్చి నిర్వాహకులు కేసు పెట్టారు. దీంతో చర్చి నిర్మాణం అడ్డుకున్నారని 8 మందిని అరెస్టు చేశారు పోలీసులు.
బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలియడంతో హుటాహుటిన కొండపాక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ శ్రేణులతో పీఎస్‌లో బైఠాయించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఏసీపీ ఎంపీ రఘునందన్ రావుతో మాట్లాడారు. ( https://youtu.be/ZueYhPID2xs )ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తలపై ఏఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.. ఎందుకు పెట్టారంటూ ఏసీపీని నిలదీశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఏం చదువుకున్నావ్. . ఏ సెక్షన్ కింద ఎంత శిక్ష పడుతుందో తెలుసా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏసీపీ సమాధానం చెబుతున్నా వినకుండా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఎంపీ రఘునందన్ రావు.