జాతీయం

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో విశాల్!.. ఎందుకలా?

స్టార్ హీరో విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా హీరో విశాల్ నటించినటువంటి మదగజ రాజ ఈవెంట్ లో విశాల్ ను చూస్తుంటే తన ఆరోగ్యం పూర్తిగా పాడైనట్లు తెలుస్తుంది. చాలా సన్నగా మారిపోయి, చేతులు వణుకుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా ఈవెంట్ లో భాగంగా వేదిక పైకి వచ్చే క్రమంలో సరిగా నడవలేక పోయారు. అంతేకాకుండా ఆ ఈవెంట్ కి వచ్చిన అతిథులు అందరు కూడా విశాల్ ని పరామర్శిస్తుండడం తో హీరో విశాల్ కి ఏమైంది అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి…

అయితే మరోవైపు హీరో విశాల్ కొద్దిరోజులుగా హై ఫీవర్ తో పాటు జలుబుతో బాధపడుతున్నట్లుగా వార్త కథనాలు వస్తున్నాయి. కాగా మదగజ రాజ సినిమా 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకోగా తాజాగా 2025 లో రిలీజ్ కాబోతుంది అని సినిమా యూనిట్ చెప్పారు. తాజాగా హీరో విశాల్ ఆరోగ్యం పై అందరూ చర్చిస్తున్న సమయంలో అపోలో డాక్టర్స్ హీరో విశాల్ ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చారు. హీరో విశాల్ ఆరోగ్యం రిపోర్టు గురించి ఒక లెటర్ విడుదల చేశారు.

తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన

అందులో ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని , విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని, ప్రస్తుతం హీరో విశాలకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు ఒక లేఖను విడుదల చేశారు. కాగా ఈవెంట్లో సరిగా నడవలేకపోవడంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా అసలు హీరో విశాల్ ఏనా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం డాక్టర్లు ప్రతి నిమిషం విశాల్ ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో విశాల్ అభిమానులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button