సినిమా

హీరో విశాల్ కు సీరియస్.. స్టేజీపైనే ఫల్టీ

తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్తతి నిలకడగా వున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్‌జెండర్‌ అందాల పోటీలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఆకర్యక్రమం జరుగుతుండగానే విశాల్.. సడన్ గా సొమ్మసిల్లి పడిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనకు ఏమైందో అని అభిమానులు కలవరపడ్డారు.

విశాల్ స్పృహతప్పి పడిపోయిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్లనే నటుడు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు సామాచారం. చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని సమాచారం.

జనవరిలో ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్‌ చాలా నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. స్టేజ్ పై వణుకుతూ కనిపించడంతో, అతని ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే విశాల్ టీమ్‌ ఆ వార్తలను కొట్టిపారేసింది. తీవ్ర స్థాయిలో జ్వరం రావడంతో అలా కనిపించారని క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వేదికపై స్పృహతప్పి పడిపోయిన ఘటన ఫ్యాన్స్ ను మరింత ఆందోళనకు గురిచేసింది. కాకపోతే ఇప్పుడు బాగానే ఉన్నాడని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button