పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. సనాతన ధర్మం తన లక్ష్యమన్న పవన్.. సెక్యులరిజం అంటే ఏంటని ప్రశ్నించారు. అల్లాకో న్యాయం… అమ్మవారికి ఓ న్యాయమా అని నిలదీశారు. హిందు పండుగలను.. హిందు దేవుళ్లను అవమానిస్తే చూస్తు ఊరుకోవాలా అని కామెంట్ చేశారు. హిందీని తమపై బలవంతంగా రుద్దవద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ పై సీరియస్ అయ్యారు జనసేనాని. హిందీ బాషను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులేనని చెప్పారు. అంతేకాదు ఉత్తర భారతం.. దక్షిణ భారతం అని వేరు చేస్తే బాగుండదని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
పవన్ కామెంట్లను హిందూ సంఘాలు ప్రశంసిస్తున్నాయి. సనాతన ధర్మానికి పవన్ అసలైన్ బ్రాండ్ అంబాసిడర్ అని కితాబిస్తున్నాయి. అయితే పవన్ మాటలపై తమిళ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హీరో విజయ్. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందని మండిపడ్డారు. ఆవిర్భావ సభ జనసేనది అయితే అందులో ఎజెండా బీజేపీదిలా ఉందన్నారు. ఇతర రాష్టాల నుoచి వచ్చిన వారికి.. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంతో మందికి జీవనోపాధి ఇస్తున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల భాషాలపై తమకు గౌరవం ఉందన్నారు విజయ్. అలా అని భాషని తమపై రుద్దాలని చూడటం సరికాదన్నారు.మన తమిళ, తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో 3 భాషగా పరిగణిస్తారా అని నిలదీశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని పవన్ కు వార్నింగ్ ఇచ్చారు హీరో విజయ్.