
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా హరీష్ రావు రేవంత్ రెడ్డి పై కౌంటర్ వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ జాతిపిత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతు పితగా పేరు తెచ్చుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేయడం జరిగింది. కెసిఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారని అన్నారు. అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి చనిపోవాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రం పరువు పోతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. స్టేచర్ వ్యాఖ్యల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారని అన్నారు. వ్యక్తిత్వ హననానికి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్అని హరీష్ రావు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రెండేళ్లలో అమరావతి నిర్మాణం!
గ్రామంలో చిరుత పులి కలకలం… అందుబాటులో లేమన్న ఫారెస్ట్ అధికారులు..