
సంగారెడ్డి, క్రైమ్‌మిర్రర్: గడ్డిపోతారం ప్రమాదం తీవ్ర విషాదకరమని బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకలిగించిందన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రలుకు మరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు…
పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని హరీశ్‌రావు అన్నారు. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదం. గత చేదు అనుభవాల నుండి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటోందని అన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు మీరు చేస్తున్నదేమిటి అని నిలదీశారు.
భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు అని కాంగ్రెస్ సర్కార్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. సరాక పరిశ్రమ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలన్నారు. ఉపాధి కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సిగాచి ఘటనలో ఇంటి పెద్దను కోల్పోయిన 54 మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలన్నారు.
ఇవి కూడ చదవండి:
- చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!
-
విజయదశమి సందర్భంగా ‘ఇడుపు కాయితం’ కొత్త పోస్టర్.. ప్రియదర్శి సినిమా నుంచి స్పెషల్ అప్డేట్!
-
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. నవంబర్ 11న విజయవాడలో ఆవిర్భావ సభ!
-
హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల కొరడా.. 8 నెలల్లో 100 వాహనాలు సీజ్!