
-
500 గజాలలోపు స్థలాల క్రమబద్ధీకరణ
-
పేద, మధ్యతరగతి వారికి ఊరట
-
కాంగ్రెస్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పేద, మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన జీవో 59 కింద వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ శాఖ అధికారికంగా పచ్చ జెండా ఊపింది. ముఖ్యంగా 500 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న హౌసింగ్ సైట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను నెల రోజుల్లో గా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది నిజంగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి సువర్ణ అవకాశమే.
అనేక రకాల ఆరోపణలు…
గత ప్రభుత్వ హయాంలో జీవో 59 అమలు ప్రక్రియలో భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఖాళీ స్థలాలను, భారీ భూభాగాలను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగడంతో.. అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ తరుణంలో లెస్కులన్నింటినీ సరిదిద్దిన ప్రస్తుత ప్రభుత్వం… అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు హక్కులు కల్పించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నిర్ణయంతో నగరాలతో పాటు పట్టణాల్లో ఏళ్ల తరబడి తమ సొంత ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్లు, పట్టాల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు గురవుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలగనుంది.
దరఖాస్తుదారుని అర్హత, భూమికి సంబంధించిన అసలు రికార్డులు, ఖచ్చితమైన విస్తీర్ణం ఆధారంగానే అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. విచారణలో చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా.. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా కన్వేయన్స్ డీడ్లు జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో గతంలో జరిగిన అక్రమార్కుల ఆట కట్టించేందుకు రెవెన్యూ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, అభ్యంతర కర స్థలాల విషయంలో న్యాయస్థానాల తుది తీర్పులకు లోబడే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రజా పాలనలో రెవెన్యూ సేవలను సామాన్యులకు వేగంగా, అవినీతి రహితంగా అందించడమే ధ్యేయమని.. ఈ క్రమబద్దీకరణ ద్వారా మధ్యతరగతి గృహ యజమానుల ఆస్తులకు చట్టబద్ధత చేకూరి క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది.
ఇవి కూడ చదవండి:
-
మహిళలు ఉద్యోగాలు అడిగేవాళ్లు కాదు.. ఇచ్చేవాళ్లు కావాలి: సీఎం చంద్రబాబు
-
ఎల్బీనగర్ టు హయత్ నగర్…! డబుల్డెక్కర్ కారిడార్
-
టెండర్లలో 15 శాతం కమీషనా? రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
-
24 లక్షల ఎకరాల అటవీ భూమి ఏమైంది? కాంగ్రెస్ సర్కార్కు ఏలేటి సూటి ప్రశ్న