![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-9.02.59-AM-780x470.jpeg?lossy=1&strip=1&webp=1)
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వృద్ధురాలిని మాటలతో నమ్మించి.. తర్వాత దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారు. ఇద్దరు అమ్మాయిలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం సర్వే చేస్తున్నామంటూ ఒంటరిగా ఉన్న వృద్దురాలి ఇంట్లోకి వచ్చారు అమ్మాయిలు.ఇంట్లో ఉన్న వృద్ధురాలని మాటలో పెట్టి ఆధార్ కార్డ్ చూపించాలని ఏడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఉట్ పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గజ్జలి లక్ష్మీ అనే వృద్ధురాలు ఇంట్లో పనిచేస్తూ ఉండగా ఇద్దరు మహిళలు ఇంట్లోకి వచ్చి ఆధార్ కార్డ్ చూపించాలని అడిగారు. మహిళను మాటల్లో పెట్టిన ఇద్దరు మహిళలు లక్ష్మీ మెడలో నుండి పుస్తెలతాడు ఇంకా బంగారు ఆభరణాలు సుమారు 7 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అంతకు ముందు గ్రామంలో వీధి వీధిన మహిళలు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.