
హైదరాబాద్, క్రైమ్మిర్రర్: దసరా పండుగ వేళ బంగారం ధరలు భారత్లో దిగివస్తున్నాయి. ఈ రోజు బుధవారం ధరలు భారీగా తగ్గాయి. మేలిమి బంగారం ధర రూ.1000 మేర దిగొచ్చింది. ఈ వారం ధరలు పతనం కావడం ఇది వరుసగా మూడోసారి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1030 మేర తగ్గి రూ.₹1,48,260కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలో రూ.950 కోత పడింది. ప్రస్తుతం ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,35,900గా ఉంది. వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల (కిలో) వద్ద స్థిరంగానే కొనసాగుతోంది.