
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి అని తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మచిలీపట్నం కృష్ణ వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తెలుగును పరిపాలనభాషగా చేసుకోవాలి అని స్పష్టం చేశారు. నేను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నాను అని వెంకయ్య నాయుడు అన్నారు. కాబట్టి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యమిచ్చి ఆ తరువాతనే ఇతర హిందీ మరియు ఇంగ్లీష్ లాంటి భాషలు నేర్చుకోవాలి అని యువతకు పిలుపునిచ్చారు. తెలుగు భాష నేర్చుకుంటేనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు భాష వెలుగుతుంది అని పేర్కొన్నారు. కాగా ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మరియు హిందీ వంటి భాషలు నేర్చుకోవడం వల్ల మాతృభాష తెలుగు స్పష్టతగా పలకలేకపోతున్నారు. ఇలానే భవిష్యత్తు రోజుల్లో అందరూ ఇంగ్లీష్ లేదా హిందీ నేర్చుకుంటూపోతే మన మాతృభాష తెలుగు మాట్లాడడమే తప్ప చదవలేరు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులే వారి పిల్లలకు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చేలా చిన్నప్పటి నుంచే నేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంతోమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : Rajnath- Andrey Meeting: భారత్-రష్యా రక్షణ మంత్రుల సమావేశం, రక్షణ ఒప్పందాలపై కీలక చర్చలు!
Read also : Air fares: ఇండిగో క్రైసిస్.. క్యాష్ చేసుకుంటున్న ఇతర విమాన సంస్థలు!





