
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో గ్యాస్ గీజర్ల కారణంగా ఎంతో మంది మరణించిన సందర్భాలు మనం ప్రతిరోజు సోషల్ మీడియాలోనూ లేదా వార్తల లోనూ చూస్తూనే ఉన్నాము. గత ఏడాది నుంచే ఎంతోమంది ఈ గ్యాస్ గీజర్ల ద్వారా స్నానం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోవడం.. లేదా తల తిరిగి స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా వైద్యునిపునులు ఈ గ్యాస్ గీజర్లు చాలా ప్రాణాంతకమని హెచ్చరించారు. స్నానం చేసేటప్పుడు ఇలా ఆకస్మాత్తుగా తల తిరగడం లేదా స్ప్రహ తిరిగి పడిపోవడం వంటివి సాధారణమైన విషయం కాదు అని.. ఇది గ్యాస్ గీజర్ సిండ్రోమ్ కావచ్చు అని వైద్యులు తెలిపారు.
Read also : Rape Case: అర్థరాత్రి యువతిని లాక్కెళ్లి అత్యాచారం.. ఆపై మరో ఘోరం
ఈ గ్యాస్ గీజర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి విడుదల అయ్యేటువంటి రంగు లేదా వాసన లేని కార్బన్ మోనాక్సైడ్ ప్రాణాంతకంగా మారుతుంది అని హెచ్చరించారు. ఇక మనం ఉపయోగించేటువంటి బాత్రూంలో సరైన వెంటిలేషన్ లేకపోతే మాత్రం ఈ విషవాయువు నిశ్శబ్దంగానే మన ప్రాణాలను అమాంతంగా తీస్తుంది అని జాగ్రత్త చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వీలైనంతవరకు ఈ గ్యాస్ గీజర్లు బదులుగా ఎలక్ట్రిక్ గీజర్లను వాడడం చాలా మంచిది అని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఈ గ్యాస్ గీజర్ కారణంగా స్పృహతప్పి పడిపోవడం లేదా తల తిరగడం వంటి కారణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ గీజర్లు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి అని వైద్యులు సూచిస్తున్నారు.
Read also : భార్య కోసం తల్లిదండ్రులను ముక్కలుగా నరికి చంపాడు





