
మెదక్, క్రైమ్మిర్రర్: మండి బిర్యాని తిని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. స్థానికంగా ఉన్న వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో ఇటీవల మండి బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యం పాలు కాగా వారిని హుటాహుటీనా నర్సాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా బాధితుల్లో సాయిరామ్(19) పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్సపొందుతూ యువకుడు మృతి చెందగా మిగితా 18 మందికి చికిత్స నర్సాపూర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. యువకుడి మృతిపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాయిరామ్ మృతికి కారణమైన వారిని కఠిన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆహార నమూనాలను పరీక్షించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడ చదవండి:
- హైదరాబాద్లో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. సినిమా చూస్తూ డ్రైవింగ్! సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
-
యూట్యూబ్ వీడియోలు చూసి నిధి వేట.. పాడుబడ్డ బంగారు గనిలో చిక్కుకున్న వ్యక్తి!
-
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఈడీ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి
-
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవకు ఈడీ నోటీసులు!