
క్రైమ్ మిర్రర్ : సద్దుల బతుకమ్మ సందర్భంగా జగిత్యాల జిల్లాలోని రాజారాంపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. మృతుడు బొంతు సంతోష్ హత్య కేసులో శివరాత్రి మల్లేష్ (40), అతని కుమారుడు శివరాత్రి అనిల్ కుమార్ (21)ను అరెస్ట్ చేసినట్లు ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి వెల్లడించారు.
పాత కక్షలతోనే హత్య?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సంతోష్, నిందితుల మధ్య గతంలో గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాజారాంపల్లి గ్రామంలోని పాత గూడూరు చౌరస్తా వద్ద సంతోష్ ఉండగా, అనిల్ కుమార్ తన తండ్రి మల్లేష్ ప్రోత్సాహంతో కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో సంతోష్‌కు పలుచోట్ల తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
కేసు నమోదు.. నిందితులకు రిమాండ్
ఈ ఘటనపై మృతుడి తండ్రి బొంతు మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేశారు. ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు.
also read ; మచిలీపట్నంలో దారుణ హత్య.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం