
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో రాజకీయాలు అంటే అంత సులభమేం కాదు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్ల సమయంలో వై నాట్ 175 అని.. 175 సీట్లు ఎందుకు గెలవలేము అని ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి 11 సీట్లు మాత్రమే గెలిచి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా నెరవేర్చారు.. ఇక గెలుపు మనదే అని వైసిపి పార్టీ నాయకులందరూ కూడా భావించారు. కానీ ఆ తరువాత జగన్ ఓడిపోవడం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చక చక జరిగిపోయాయి. జగన్ ఓడిపోయినప్పటి నుంచి కూడా వైసిపిలోని కొంతమంది నాయకులు అందరూ వారి వారి మార్గాల్లో పార్టీని కాస్త పక్కన పెట్టి వారికి నచ్చినట్లుగా వ్యవహరించారు. దీనిపై జగన్ కూడా చాలాసార్లు నచ్చజెప్పడం, చర్చలు జరపడం కూడా చేశారు.
Read also : Gemini AI పై కొందరు విమర్శలు.. మరికొందరు ప్రశంసలు! కారణం ఇదే?
నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు నేడు కాస్త లైన్ లోకి రావడం వల్ల జగన్ కు ఉన్న టెన్షన్ తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇటీవల 17 మెడికల్ కాలేజీలను పి పి పీ విధానంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తుందని ఆగ్రహించారు. దీనిని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని.. ఈ కాలేజీలు దక్కించుకోవడానికి టెండర్లు వేసే వారికి జగన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్లను వెంటనే రద్దు చేస్తామని కూడా అన్నారు. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని… వైసిపి కార్యకర్తలు అందరూ కూడా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు చేపడతామని… అక్కడక్కడ నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని జగన్ చెప్పుకొచ్చారు. ఈ మాటతో ఏకంగా చిత్తూరు నుంచి పైన శ్రీకాకుళం జిల్లాలలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో కొన్ని కాలేజీలు నిర్మాణం పూర్తయిందని.. మరికొన్ని కాలేజీలు పునాదుల దశలో ఉన్నాయని వీటిని మీరు ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదని… వైసిపి తరఫున కార్యకర్తలు అలాగే నాయకులు ఉద్యమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంపై ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా బయటికి రావడంతో జగన్ కు కూడా బలం చేకూరింది. నిన్న మొన్నటి వరకు ఎవరు కూడా పార్టీ తరఫున బయటకు రాలేదు. కొంతమంది ముఖ్య నేతలు బయటకు వచ్చిన మిగతావారు సరిగా రాకపోయేసరికి జగన్ గుండెల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అయితే నేడు ఆ టెన్షన్ అంతా కూడా తగ్గిపోయిందనే చెప్పాలి. దీంతో వైసిపి కార్యకర్తలు అలాగే అభిమానులు అందరూ కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
Read also : రాజీనామా చేయండి.. MLA కడియంకు ఓటర్ల లేఖలు