
-
ప్రత్యేక ఉపాధి పథకం…. పేదకూలీలకు అండా…
-
సంక్రాంతి నుంచి మే వరకు ఈ పథకం కొనసాగింపు…
-
రాష్ర్ట ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ రాష్ర్టాన్ని ఎల్‌నినో ఎపెక్ట్ భయాందోళనకు గురి చేస్తుంది. దీంతో కరువు ముప్పు కొనసాగుతున్న వేళ రాష్ర్ట ప్రభుత్వం పేద కూలీలకు తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తరువాత ప్రారంభమయ్యే ప్రత్యేక ఉపాధి పథకంతో పేద కూలీలకు భరోసా ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులకు అదనంగా రాష్ర్ట ప్రభుత్వం కూడ నిధులు కేటాయించనుంది. కాగా ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాబావ పరిస్థితులు, నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కవుగా ఉన్న నేపథ్యంతో ముందస్తుగానే రాష్ర్ట ప్రభుత్వం కీలక చర్యలకు సిద్దమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, పేద కూలీలు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు నాలుగు నెలల ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రెడ్డి ప్రకటించారు.ఈ పథకం సక్రాంతి నుంచి మొదలు కొని మే వరకు కొనసాగనుంది. ఎల్‌నినో వాతావరణ పరిస్థితులపై అంచనా వేసి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కాగా ఎల్‌నినో పరిస్థితులపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశయ్యారు.
రైతులు వర్షాదార పంటలు, కూరగాయలు పండించాలి…సీఎం రేవంత్ రెడ్డి…
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 30 లక్షల పంపుసెట్లలో 15 లక్షలు ఇప్పటికే ఎండిపోయాయని, రైతులు కేవలం వర్షాధార పంటలు, కూరగాయలను మాత్రమే పండించాలని కోరారు. ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యంలో 20% కంటే తక్కువకు పడిపోగా, కొన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరత కారణంగా, తాగునీటి అవసరాలకే సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరూ నష్టపోకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. పశువులకు మేత, తాగునీటిని అందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉపాధి హామీ పథకాల కింద అదనపు పనిదినాలను సృష్టిస్తామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విద్యుత్ ప్రాజెక్టులను ఆయన విమర్శించారు. కోవిడ్-19 మహమ్మారిని సరిగ్గా నిర్వహించలేదని, నిధులను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు.
కేబినెట్ కమిటీ ఏర్పాటు….
రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రత్యేక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, రోజువారీ వేతనం, అర్హతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక కేబినెట్ కమిటిని ఏర్పాటు చేయగా, కె. రామకృష్ణారావును ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. వ్యవసాయ మార్గాలు, కాలువలు, చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై కూడా దృష్టి సారించే ఉపాధి పథకాన్ని ఒక ప్రత్యేక యాప్ పర్యవేక్షిస్తుంది. ‘కళాజాతాలు’ (సాంస్కృతిక బృందాలు) రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఎంపీ చామలా కిరణ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇవి కూడ చదవండి:
-
ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ నుంచి సరికొత్త పోస్టర్ విడుదల.. ఆ వీడియోపై పెరిగిన ఆసక్తి!
-
తేజ సజ్జా పెళ్లిపై క్లారిటీ.. డిసెంబర్లో ఉదయ్పుర్లో డెస్టినేషన్ వెడ్డింగ్!
-
హాలీవుడ్లో సినిమా చేయడమే నా కోరిక.. ‘వారణాసి’ తర్వాతే ఆలోచిస్తా: రాజమౌళి
-
కోలీవుడ్‌లో మరో విషాదం… ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత.